Rahul Gandhi: రంపం పట్టిన రాహుల్‌.. వడ్రంగి పనివారితో చిట్‌చాట్‌

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తాజాగా దిల్లీలోని వడ్రంగి పనివారితో కలిశారు. వారి కష్టాలు తెలుసుకోవడంతో పాటు తానూ ఓ చేయి వేశారు.

Published : 28 Sep 2023 17:56 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరో కొత్త అవతారం ఎత్తారు. మొన్నటికి మొన్న ట్రాక్టర్‌ దుక్కి దున్ని వరినాట్లు వేసిన రాహుల్‌.. ఇటీవల రైల్వే స్టేషన్‌లో హమాలీలతో ముచ్చటించడంతో పాటు కూలీ అవతారమూ ఎత్తారు. తాజాగా దిల్లీలోని అతిపెద్ద ఫర్నీచర్‌ మార్కెట్‌ కృతి నగర్‌లో పర్యటించారు. అక్కడి వడ్రంగి పనివారిని కలిసి వారితో మాట్లాడారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. పనిలో పనిగా ఫర్నీచర్‌ తయారీలో తాను ఓ చేయి వేశారు.

ఫర్నీచర్‌ మార్కెట్‌ పర్యటనకు సంబంధించిన చిత్రాలను రాహుల్‌ స్వయంగా పోస్ట్‌ చేశారు. ‘‘ఈ రోజు దిల్లీలోని కీర్తినగర్‌లో ఉన్న ఆసియాలోనే అతిపెద్ద ఫర్నీచర్ మార్కెట్‌కి వెళ్లి కార్పెంటర్‌ సోదరులను కలిశాను. వారు హార్డ్ వర్కర్లే కాకుండా కాదు.. అద్భుతమైన కళాకారులు కూడా. వారి నుంచి కొన్ని నైపుణ్యాలు తెలుసుకోవడంతో పాటు నేర్చుకోవడానికి ప్రయత్నించా’’ అంటూ రాసుకొచ్చారు. కాంగ్రెస్‌పార్టీ ఈ చిత్రాలను పోస్ట్‌ చేస్తూ ‘భారత్‌ జోడో యాత్ర’ కొనసాగుతోంది అని క్యాప్షన్‌ ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు