నిర్మించడం తెలియదు అమ్మడమే : రాహుల్‌

దిల్లీ: కేంద్ర సర్కారు భాజపాపై కాంగ్రెస్‌ అగ్రనేత మరోసారి విమర్శలు గుప్పించారు. ఇప్పటికే ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాల పూర్తి అమ్మకానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తుందని  వస్తున్న వార్తలపై రాహుల్ సోమవారం ఘాటుగా స్పందించారు.  ఈ మేరకు...

Published : 16 Mar 2021 01:42 IST

దిల్లీ: భాజపా నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై కాంగ్రెస్‌ అగ్రనేత మరోసారి విమర్శలు గుప్పించారు. ఇప్పటికే ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాలను పూర్తి విక్రయానికి కేంద్రం నిర్ణయించిందని వచ్చిన వార్తలపై రాహుల్ సోమవారం ఘాటుగా స్పందించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని భాజపాకు ఎలా నిర్మించాలో తెలియదు గానీ, ఎలా అమ్మాలో మాత్రం పూర్తి అవగాహన ఉందంటూ ట్విటర్‌‌ వేదికగా ఎద్దేవా చేశారు. ప్రైవేటీకరణతో ప్రజలు నష్టపోతారని ఆవేదన వ్యక్తంచేశారు. మోదీ ఆప్తమిత్రులు మాత్రమే లబ్ధి పొందుతారని విమర్శించారు. #IndiaAgainstPrivatisation అనే హ్యష్‌ట్యాగ్‌ జోడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని