ఓటమి వేళ భాజపా అస్త్రం.. సోదాలు

తమిళనాడులో శాసనసభ ఎన్నికల ముందు డీఎంకే నేతల ఇళ్లపై జరుగుతున్న ఆదాయ పన్ను సోదాలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ఓటమి భయంతోనే భాజపా ఇలాంటి

Published : 02 Apr 2021 17:44 IST

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శలు

దిల్లీ: తమిళనాడులో శాసనసభ ఎన్నికల ముందు డీఎంకే నేతల ఇళ్లపై జరుగుతున్న ఆదాయ పన్ను సోదాలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ఓటమి భయంతోనే భాజపా ఇలాంటి దాడులకు పాల్పడుతోందంటూ ట్విటర్‌ వేదికగా దుయ్యబట్టారు. ‘‘ఎన్నికల్లో ఓటమి ఎదురవుతున్న సమయంలో భాజపా ఉపయోగించే సిద్ధాంతం.. ప్రతిపక్షాలపై దాడులు చేయించడం’’ అని రాహుల్‌ విమర్శించారు. 

డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ అల్లుడు శబరీశన్‌ ఇంట్లో శుక్రవారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. శబరీశన్‌ నివాసంతో పాటు డీఎంకే పార్టీకి చెందిన నాలుగు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అన్నానగర్‌ డీఎంకే అభ్యర్థి మోహన్‌ కుమారుడి ఇంట్లోనూ సోదాలు జరిపారు. అయితే ఈ దాడులను డీఎంకే తీవ్రంగా ఖండించింది. రాజకీయ దురుద్దేశంతోనే ఎన్నికల ముందు కేంద్రం ఈ సోదాలు జరిపిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌ ఆరోపించారు. ఇలాంటి వాటికి భయపడేది లేదని పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌ చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని