MMTS: ఎంఎంటీఎస్‌ పనుల పూర్తికి రాష్ట్రం వాటా చెల్లించట్లేదు: రైల్వే మంత్రి

2009-14 మధ్య కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ తెలంగాణ అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహించిందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ విమర్శించారు. ఉమ్మడి....

Published : 04 Mar 2022 19:04 IST

హైదరాబాద్‌: 2009-14 మధ్య కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ తెలంగాణ అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహించిందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ విమర్శించారు. ఉమ్మడి ఏపీకి రూ.886 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు రైల్వే లైన్లు రెండింతలయ్యాయనీ.. . రైల్వేస్టేషన్లు కూడా మెరుగయ్యాయని చెప్పారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణకు మోదీ రూ.1110 కోట్లు కేటాయించారు. రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాల్ని శరవేగంగా చేపడుతున్నాం. కాంగ్రెస్‌ హయాంలో రైల్వే డబ్లింగ్‌ పనులు కూడా శూన్యమే. మేం రైల్వే అభివృద్ధి, డబ్లింగ్, ట్రిప్లింగ్‌కు అదనంగా నిధులు మంజూరు చేస్తున్నాం. ఎంఎంటీఎస్‌ పనుల పూర్తికి రాష్ట్రం వాటా చెల్లించడంలేదు. త్వరలో పిరియాడిక్‌ ఓవరలింగ్‌ టెండర్లు పిలుస్తాం. పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయి. కాజీపేటలో పీవోహెచ్‌ వర్క్‌షాపు ఏర్పాటు చేస్తున్నాం’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని