Rajagopalreddy: మాజీ ఎంపీలతో కలిసి బండి సంజయ్‌తో రాజగోపాల్‌ రెడ్డి భేటీ

మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు

Published : 10 Aug 2022 01:35 IST

పంతంగి: మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో ఆయన భేటీ అయ్యారు. పంతంగి వద్ద మాజీ ఎంపీలు వివేక్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి బండి సంజయ్‌తో రాజగోపాల్‌రెడ్డి భేటీ అయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై బండితో చర్చించిన ఆయన .. భాజపాలో చేరిక తేదీ, బహిరంగసభ అంశంపై చర్చించారు.  

ఇప్పటికే దిల్లీలో పార్టీ జాతీయ నేతలతో రాజగోపాల్‌రెడ్డి భేటీ అయ్యారు. అక్కడే పార్టీలో చేరాల్సి ఉన్నా.. తన నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరతానని ఆయన చెప్పినట్టు భాజపా వర్గాలు చెబుతున్నాయి. ఈక్రమంలోనే ఈనెల 21న అమిత్‌ షా సమయం ఇవ్వడంతో.. రాజగోపాల్‌తో పాటు మరికొందరు కమలం గూటికి చేరేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే విషయమై బండి సంజయ్‌తో చర్చించిన రాజగోపాల్‌... బహిరంగ సభ ప్రదేశం, ఏర్పాట్లపై చర్చించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts