రాజస్థాన్‌ మంత్రివర్గ విస్తరణ..పైలట్‌ వర్గానికి చోటు

ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. 11 మంది కేబినెట్‌ మంత్రులు, నలుగురు సహాయ మంత్రులు సహా మొత్తం 15 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

Published : 21 Nov 2021 18:21 IST

జైపూర్‌:  రాజస్థాన్‌లో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. 11 మంది కేబినెట్‌ మంత్రులు, నలుగురు సహాయ మంత్రులు సహా మొత్తం 15 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరి చేత గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించారు. గత కేబినెట్‌లో సహాయ మంత్రులుగా పనిచేసిన మమతా భూపేశ్‌, భజన్‌లాల్‌ జాతవ్‌, టిక్రమ్‌ జుల్లీ కేబినెట్‌ ర్యాంక్‌ కల్పించారు. గతేడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన విశ్వేంద్ర సింగ్‌, రమేశ్‌మీనాకు మళ్లీ మంత్రివర్గంలో చోటు కల్పించారు.

మంత్రివర్గ ప్రక్షాళనకు ముందు సీఎంతో కలిపి మొత్తం 21 మంది మంత్రులు ఉండడగా.. పునర్‌వ్యవస్థీకరణ అనంతరం ఆ సంఖ్య 30కి చేరింది. సీఎంతో కలిపి గరిష్ఠంగా 30 మంది మంత్రులు ఉండొచ్చు. గత కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన గోవింద్‌ సింగ్‌ దోత్సారా, హరీశ్‌ చౌధరి, రఘు శర్మను మంత్రివర్గం నుంచి తప్పించగా.. మిగిలిన వారు యథావిధిగా కొనసాగారు. కొత్తగా 12 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో ఐదుగురు సచిన్‌ పైలట్‌ వర్గానికి చెందిన వారు ఉన్నారు. గతేడాది అశోక్‌ గహ్లోత్‌కు వ్యతిరేకంగా సచిన్‌పైలట్‌ వర్గం తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో రాజస్థాన్‌ రాజకీయాల్లో పెద్ద కుదుపు ఏర్పడింది. దీంతో పైలట్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం నచ్చజెప్పింది. ఏడాది తర్వాత మంత్రివర్గంలో ఆ వర్గానికి చోటు కల్పించింది. సచిన్‌ పైలట్‌కు వచ్చే ఏడాది జరిగే గుజరాత్‌ ఎన్నికల బాధ్యతలను అధిష్ఠానం అప్పగించే అవకాశం ఉంది.

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని