Rajnath Singh: రాహుల్ లాహోర్ వెళతారనుకున్నా.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్‌గాంధీ కరాచీ లేదా లాహోర్‌కు వెళతారని ఊహించానని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఈనాడు, బెంగళూరు: భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్‌గాంధీ కరాచీ లేదా లాహోర్‌కు వెళతారని ఊహించానని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన గురువారం కర్ణాటకలోని బెళగావి జిల్లా నందగఢ్‌లో విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. ‘1947లోనే భారత్ విడిపోయింది. భారత్‌ను జోడించేందుకు బహుశా రాహుల్‌గాంధీ కరాచీ లేదా లాహోర్‌కు వెళతారని ఊహించా. అక్కడికి వెళ్లలేదు’ అని ఎద్దేవా చేశారు. ఇదే సందర్భంగా సైనికుల ధైర్యసాహసాలపై ప్రశ్నలు సంధించిన రాహుల్‌గాంధీని మంత్రి తీవ్రంగా విమర్శించారు. ‘ఒక రక్షణ మంత్రిగా భారత సైనికుల ధైర్యసాహసాల పట్ల ఎంతో గర్విస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. బుధవారం విజయ సంకల్ప యాత్రను పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించగా గురువారం రాజ్‌నాథ్‌సింగ్ యాత్రలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Social Look: విజయ్ దేవరకొండ ఐస్ బాత్.. మీనాక్షి స్టన్నింగ్ లుక్.. ఐశ్వర్య బ్రైడల్ పోజ్
-
Game Changer: అందుకే షూటింగ్ వాయిదా.. రూమర్స్‌పై ‘గేమ్ ఛేంజర్’ టీమ్
-
TOEFL: విదేశాల్లో సెకండరీ ఎడ్యుకేషన్‌పై.. భారతీయుల మొగ్గు!
-
India vs Australia: ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్నారు.. కంగారూల ఎదుట భారీ లక్ష్యం
-
Kangana Ranaut: మహేశ్ బాబు సినిమాలో నటించలేదన్న బాధ ఉంది: కంగనా రనౌత్
-
Chandrababu Arrest: అక్టోబరు 5వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు