Ram Mohan Naidu: పెండింగ్‌ విమానాశ్రయాలను రెండేళ్లలో పూర్తి చేస్తాం: రామ్మోహన్‌ నాయుడు

ఏపీ అసెంబ్లీ లాబీలో మంత్రి నారా లోకేశ్‌ను కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు కలిశారు.

Published : 22 Jun 2024 15:45 IST

అమరావతి: ఏపీ అసెంబ్లీ లాబీలో మంత్రి నారా లోకేశ్‌ను కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు కలిశారు. ఇరువురు నేతలు అప్యాయంగా ఆలింగనం చేసుకుని కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. ఏపీలో పెండింగ్‌లో ఉన్న ఎయిర్‌పోర్టుల పని ఎప్పటిలోగా పూర్తి చేస్తారని రామ్మోహన్‌ నాయుడుని మంత్రి లోకేశ్‌ అడగ్గా.. రెండేళ్లలో పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. రెండేళ్లా.. ఇంకా త్వరగా పూర్తి చేయాలని లోకేశ్‌ కోరగా ప్రయత్నిస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని