Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుపై లోక్‌సభలో గళమెత్తిన రామ్మోహన్‌ నాయుడు

తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఆ పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు లోక్‌సభ వేదికగా గళమెత్తారు. 

Published : 21 Sep 2023 18:20 IST

దిల్లీ: తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్టుపై ఆ పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు (Ram Mohan Naidu) లోక్‌సభ వేదికగా మరోసారి గళమెత్తారు. ఇంధన రాకెట్ల ప్రయోగాలు చేసిన ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ను తప్పుడు కేసులతో ఎలా నిర్బంధించారో తమ నాయకుడ్ని కూడా అలాగే అరెస్టు చేశారన్నారు. ఎంతో మంది యువనాయకులకు స్ఫూర్తినిచ్చిన నాయకుడిపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తప్పుడు కేసులు పెట్టారని చెప్పారు. మరోవైపు రూ.43 వేల కోట్ల దేశ సంపదను దోచుకున్న నాయకుడు.. బెయిల్‌పై వచ్చి 10 ఏళ్లయినందుకు కొందరు సంబరాలు చేసుకుంటున్నారని రామ్మోహన్‌ ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని