TDP: నెల రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం: ఏపీ మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి

నెలలోగా మహిళలకు ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఏపీ మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి తెలిపారు.

Updated : 23 Jun 2024 14:36 IST

అమరావతి: నెలలోగా మహిళలకు ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఏపీ మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి తెలిపారు. సచివాలయం నాలుగో బ్లాక్‌లోని ఛాంబర్‌లో ఆయన రవాణా, క్రీడల శాఖ మంత్రిగా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇచ్చే ట్రైనింగ్‌ సెంటర్ల ఏర్పాటుపై తొలి సంతకం చేశారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు.

తెలంగాణ, కర్ణాటకలో ఉచిత బస్సు సౌకర్యంపై సమీక్ష నిర్వహిస్తామని రామ్ప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఉచిత బస్సు కల్పనలో ఎదురయ్యే సమస్యలపై చర్చిస్తున్నామన్నారు. రాష్ట్రంలో క్రీడా వసతులు మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచే క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్నారు. ఆర్టీసీలో ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. మూడు శాఖలు కేటాయించిన సీఎం చంద్రబాబుకు రామ్‌ప్రసాద్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని