విభజన రాజకీయాలే భాజపా లక్ష్యం: మమతా

దేశంలో భాజపా విభజన రాజకీయాలు చేస్తోందంటూ పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్‌లో భాజపా నేతలు రథయాత్రలు చేపట్టి.. రథాలపై ప్రచారాలు చేయడాన్ని తప్పుబట్టారు. ఈ మేరకు ఆమె బుధవారం రాయిగంజ్‌లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు.

Published : 11 Feb 2021 01:35 IST

కోల్‌కతా: దేశంలో భాజపా విభజన రాజకీయాలు చేస్తోందంటూ పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్‌లో భాజపా నేతలు రథయాత్రలు చేపట్టి.. రథాలపై ప్రచారాలు చేయడాన్ని తప్పుబట్టారు. ఈ మేరకు ఆమె బుధవారం రాయిగంజ్‌లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. బెంగాల్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాజపా ఇటీవల రథయాత్రలను ప్రారంభించిన విషయం తెలిసిందే.

‘దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కొందరు బెంగాల్‌కు వచ్చి సమస్యలు సృష్టిస్తున్నారు. వారికి కనీసం బెంగాల్‌ సంస్కృతి సంప్రదాయాలు కూడా తెలియవు. వారికి తెలిసిందల్లా దుష్ట రాజకీయాలు చేయడం ఒక్కటే. ప్రస్తుతం ఓ పార్టీ నాయకులు రాష్ట్రంలో దేవుళ్ల మాదిరి రథాలపై తిరిగి ప్రచారాలు చేస్తున్నారు. కేవలం సమాజంలో విభజన రాజకీయాలు చేయడమే వారి లక్ష్యం’ అని మమతా భాజపా నాయకులపై మండిపడ్డారు.

‘మాకు రథం అంటే జగన్నాథుడి రథమే గుర్తుకువస్తుంది. కానీ భాజపా రథయాత్ర పేరుతో మత విశ్వాసాలను దెబ్బతీస్తోంది. వారు ఇక్కడికి వస్తోంది రాష్ట్రాన్ని సోనార్‌ బంగ్లాగా మార్చడానికి కాదు.. హింసాత్మక బంగ్లాగా మార్చడానికి. డబ్బుతో వాళ్లు కొంతమంది ప్రజలను కొనుక్కోవచ్చు. కానీ రాష్ట్రాన్ని బెంగాల్‌ రాష్ట్రాన్ని భాజపాకు అమ్మడాన్ని మాత్రం మేం అంగీకరించం. ఆ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అల్లర్లు పెరుగుతాయి’ అని  భాజపాపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. పార్టీలో నుంచి రాజీనామా చేసి భాజపాలో చేరిన సువేందు అధికారిని ఉద్దేశిస్తూ.. ‘త్యాగశీల స్వభావం కలిగినటువంటి వ్యక్తులు తమ సిద్ధాంతాన్ని ఎప్పటికీ అమ్ముకోరు. తమ పార్టీ కేవలం త్యాగ శీలత ఉన్న వ్యక్తులకే ప్రజలకు సేవ చేసే అవకాశం ఇస్తుంది. అలా సిద్ధాంతాలు అమ్ముకునే వారు పార్టీలో లేకపోవడం మంచిదే’ అని దీదీ వ్యాఖ్యానించారు. 

ఇదీ చదవండి

ఠాగూర్‌ కుర్చీలో కూర్చోలేదు: అమిత్‌షా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని