BJP: అప్పులు చేసి ఎంత కాలం పాలిస్తారు..?.. ఏపీ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు

వైకాపా పాలనలో ఈ రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. భాజపా ఆధ్వర్యంలో కడపలో నిర్వహించిన రాయలసీమ రణభేరి సభలో కిషన్‌రెడ్డి....వైకాపా పాలనలో ఈ రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. భాజపా ఆధ్వర్యంలో కడపలో నిర్వహించిన రాయలసీమ రణభేరి సభలో

Published : 20 Mar 2022 01:44 IST

కడప: వైకాపా పాలనలో ఈ రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. భాజపా ఆధ్వర్యంలో కడపలో నిర్వహించిన రాయలసీమ రణభేరి సభలో కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జి సునీల్‌దేవ్‌ధర్‌, ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేశ్‌, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి, జనసేన నేతలు సుంకర్‌ శ్రీనివాస్‌, నాగేంద్రతో పాటు పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రతనాల సీమ వెనుకబడిపోయిందన్నారు. రాయలసీమ నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రలు వచ్చినప్పటికీ సీమలో అభివృద్ధి మాత్రం జరగలేదన్నారు. సాగునీటి ప్రాజక్టులపై నిర్లక్ష్యమే ఈ ప్రాంతం వెనుబాటుకు కారణమని అభిప్రాయపడ్డారు.

‘‘కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక రాయలసీమలో అనేక సంస్థలు నిర్మించింది. కడప, తిరుపతి, అనంతపురంలో అనేక ప్రాజెక్టులు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మిస్తున్నారు. రాయలసీమ అభివృద్ధికి సీఎం జగన్‌ చేపట్టిన కార్యక్రమాలేంటి?సీమ అభివృద్ధికి మొట్టమొదట పోరాడింది భాజపా. ఇందుకోసం భాజపా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ప్రధాని మోదీ హయాంలో రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. కేంద్రం అన్ని రకాలుగా అండగా నిలస్తోంది. ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. వైకాపా పాలన చూస్తే రానున్న రోజుల్లో ఏపీలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. అప్పులు ఇచ్చే వాళ్లు ఎంతకాలం ఇస్తారు? అప్పులపై ఆధారపడి ఎంతకాలం పాలిస్తారు? ప్రతి రైతుకు కేంద్రం ఏటా రూ.6వేలు ఇస్తోంది. ఫ్యామిలీ పార్టీలు, కుటుంబ రాజకీయాలు పోవాలి. ఏపీలో భాజపాలో చేరేవారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. వైకాపా ప్రభుత్వాన్ని విమర్శిస్తే అనేక ఇబ్బందులు పెడుతున్నారు. రాష్ట్రంలో లిక్కర్‌, ల్యాండ్‌ కాంట్రాక్టర్ల మాఫియా పెరిగింది. అవినీతి పెరిగిపోయింది. ఏంతో మంది ముఖ్యమంత్రులను చూశాను. ప్రజాస్వామ్యంలో ఎంతటి నియంతలైనా పతనంకాక తప్పదు. ఏపీలో ఈ అవినీతి ప్రభుత్వం పోవాలి. రానున్న రోజుల్లో భాజపాను అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరముంది. త్వరలో గండికోటను సందర్శించి పర్యాటకులు తరలివచ్చే విధంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడాలి: ఆదినారాయణరెడ్డి

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని మాజీ మంత్రి, భాజపా నేత ఆదినారాయణరెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని విమర్శించారు. వైకాపా హయాంలో కడప జిల్లాకు వచ్చిన ప్రాజెక్టులు ఏమిటని ప్రశ్నించారు. ‘‘చేయాల్సిన పనులు జగన్‌ చేయరు... చేయకూడనివి మాత్రం చేస్తారు. ప్రాజెక్టుల పేరుతో ఎక్కడికక్కడ అవినీతికి పాల్పడుతున్నారు. జమ్మలమడుగులో స్టీల్‌ ప్లాంట్‌ హామీ ఏమైంది. వివేకాను వాళ్లే చంపించి నాపై కేసులు పెట్టారు. చంద్రబాబు.. హత్యా రాజకీయాలు చేసే వ్యక్తి కాదు. వివేకా హత్యకేసులో బయటకు వస్తున్న పేర్లన్నీ వారివే. వైకాపా పాలనలో పరిశ్రమలు వరుసగా మూతపడుతున్నాయి. అమరరాజా, కియా ఇతర పరిశ్రమలను ఇబ్బంది పెడుతున్నారు. వైకాపా పాలనలో అన్ని వర్గాల ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గుంతలమయం’’ అని ఆదినారాయణరెడ్డి తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని