Gannavaram: గన్నవరంలో అరాచకంపై మళ్లీ దర్యాప్తు

కృష్ణా జిల్లా గన్నవరంలో తెదేపా నియోజకవర్గ కార్యాలయంపై మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరగణం గతేడాది ఫిబ్రవరి 20న జరిపిన దాడులు, సాగించిన విధ్వంసకాండకు సంబంధించిన కేసులో పోలీసులు తిరిగి దర్యాప్తు చేపట్టారు.

Updated : 10 Jul 2024 06:53 IST

తెదేపా కార్యాలయంపై దాడి ఘటనలో అరెస్టులు 

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా గన్నవరంలో తెదేపా నియోజకవర్గ కార్యాలయంపై మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరగణం గతేడాది ఫిబ్రవరి 20న జరిపిన దాడులు, సాగించిన విధ్వంసకాండకు సంబంధించిన కేసులో పోలీసులు తిరిగి దర్యాప్తు చేపట్టారు. వైకాపా ప్రభుత్వం ఉండటంతో అప్పట్లో నామమాత్రపు కేసు కట్టి చేతులు దులిపేసుకున్న పోలీసులు, కూటమి ప్రభుత్వం రావడంతో గత కొన్ని రోజులుగా సమగ్ర దర్యాప్తు చేపట్టారు. గన్నవరం డీఎస్పీ జయసూర్య ఆధ్వర్యంలో ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌ పోలీసులు పరిశీలించారు. మంగళవారం దాదాపు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. బాపులపాడు ఎంపీపీ నగేష్, తిప్పనగుంట సహకార సంఘం మాజీ ఛైర్మన్‌ మూల్పూరి ప్రభుకాంత్‌ సహా పలువురిని అదుపులోకి తీసుకుని వేర్వేరు పోలీస్‌స్టేషన్లకు తరలించారు. దాదాపు 70 మంది వరకు నిందితులను పోలీసులు ఇప్పటికే గుర్తించారని, రానున్న రోజుల్లో ఇంకా అరెస్టులు జరగనున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని