Maharashtra Crisis: ఏక్‌నాథ్‌ శిందేకి సపోర్టు చేయడానికి కారణం అదే..: రెబల్ ఎమ్మెల్యే

మహారాష్ట్రలోని శివసేన (Shiv sena) పార్టీలో కొనసాగుతోన్న తీవ్ర అంతర్గత సంక్షోభం కొలిక్కి రాలేదు. గత ఐదు రోజులుగా ఆ పార్టీలో ఉద్ధవ్‌ ఠాక్రే, ఏక్‌నాథ్‌ శిందే .....

Published : 26 Jun 2022 01:32 IST

గువాహటి: మహారాష్ట్రలోని శివసేన (Shiv sena) పార్టీలో కొనసాగుతున్న తీవ్ర అంతర్గత సంక్షోభం కొలిక్కి రాలేదు. గత ఐదు రోజులుగా ఆ పార్టీలో ఉద్ధవ్‌ ఠాక్రే, ఏక్‌నాథ్‌ శిందే వర్గాల మధ్య కొనసాగుతున్న ఈ పోరు ప్రభుత్వ మనుగడనే ప్రశ్నార్థకం చేసింది. రోజురోజుకీ ఠాక్రే నుంచి ఎమ్మెల్యేలు చేజారిపోతుండటంతో శిందే శిబిరం వైపు బలం పుంజుకుంటోంది. అసలు ఈ పరిస్థితికి కారణమేంటో.. తాము శిందేకు ఎందుకు మద్దతు ఇస్తున్నామో రెబల్‌ ఎమ్మెల్యే చిమన్‌రావు పాటిల్‌ వెల్లడించారు. ఆయన మాట్లాడిన వీడియోను ఏక్‌నాథ్‌ శిందే ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

‘‘గత 30 ఏళ్లగా మేం కాంగ్రెస్‌, ఎన్సీపీలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. మా నియోజకవర్గాల్లో మాకు ప్రధాన పోటీ దారులుగా ఆ రెండు పార్టీలే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ వారే ప్రత్యర్థులుగా ఉంటారు. అందుకే పొత్తులు సహజంగా ఉండాలని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు మేం విన్నవించుకున్నాం. కానీ ఆయన మా మనోభావాలపై ఎప్పుడూ స్పందించలేదు. అందువల్ల మా నాయకుడు ఏక్‌నాథ్‌ శిందేను ఈ అంశంపై గట్టి వైఖరి తీసుకోవాలని అభ్యర్థించాం. సహజ కూటమి శివసైనికులందరి కోరిక. అందుకే భావజాలం కోసం జరుగుతున్న ఈ తిరుగుబాటుకు మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు, 10మంది స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు లభించింది’’ అని ఆయన వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని