Munugode: మునుగోడులో రికార్డు స్థాయిలో 92 శాతం పోలింగ్‌

 తెలుగురాష్ట్రాల్లో ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ రికార్డు స్థాయిలో నమోదైంది. ఇప్పటి వరకు 92 శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.

Updated : 04 Nov 2022 00:14 IST

హైదరాబాద్‌: తెలుగురాష్ట్రాల్లో ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ రికార్డు స్థాయిలో నమోదైంది. నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉండగా..  92 శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. మరో వైపు ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలిస్తున్నారు. ఈవీఎంలను నల్గొండ తరలిస్తున్న బస్సును కొందరు వ్యక్తులు వెంబడించారు. రక్షణగా ఉన్న పోలీసులు బస్సును వెంబడించిన వాహనాన్ని పట్టుకోవడంతో అందులో ఉన్న ఐదుగురు పరారయ్యారు. ఈవీఎంలను ఎత్తుకెళ్లేందుకు కుట్ర చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బస్సును వెంబడించిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు