
Renuka Chowdary: ట్రాక్టర్ నడిపిన రేణుక.. రాజధాని రైతుల మహా పాదయాత్రకు మద్దతు
అమరావతి: రాజధాని రైతుల మహా పాదయాత్రకు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి మద్దతు పలికారు. రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ పాదయాత్రలో పాల్గొన్నవారిని ఉత్సాహపరిచారు. రైతు సమస్య ఎక్కడ ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అమరావతి అనే పిలుపు 683 రోజుల నుంచి నడుస్తోంది. ఈ పిలుపునకు మేమంతా స్పందించి వస్తున్నాం.. రైతాంగానికి ఎక్కడ ఏ సమస్య ఉన్నా ముందుకు రావడం కాంగ్రెస్ లక్ష్యం. రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు పోరాడుతూ రైతుల వాణిని కేంద్రానికి వినిపించడానికి పూనుకొన్నాం. ఇంత మంది మహిళలు నాకు కేవలం బొట్టుపెట్టి స్వాగతం పలుకుతామంటే పోలీసులు వారిని కనీసం నిలబడనీయడంలేదు. ఏం ఫర్వాలేదు. నేనే వారికి వీరతిలకం దిద్దుతా’’ అని పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.