Telangana news: ప్రశ్నిస్తే.. రైతులపై కేసులు పెట్టి బేడీలు వేస్తున్నారు: రేవంత్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. రైతులు గిట్టుబాటు ధర ఇవ్వలేదని నిలదీస్తే కేసులు పెట్టి బేడీలు..

Published : 27 Jun 2022 19:11 IST

హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. రైతులు గిట్టుబాటు ధర ఇవ్వలేదని నిలదీస్తే కేసులు పెట్టి బేడీలు వేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు అన్యాయం జరిగితే తిరగబడ్డ ప్రాంతం ఖమ్మమని.. మిర్చిపంట నష్టపోతే కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వలేదన్నారు. వరంగల్‌ డిక్లరేషన్‌ ద్వారా రైతులకు ఏకకాలంలో రూ.2లక్షలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. 22 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా.. సీఎం ఆ కుటుంబాలను పరామర్శించలేదని ఆక్షేపించారు. మంత్రి పువ్వాడ అజయ్‌పై పోరాటం చేస్తున్న విద్యార్థులపై కేసులు పెట్టారని.. ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా మంత్రిని బర్త్‌రఫ్‌ చేయాల్సింది పోయి దగ్గరకు తీసుకున్నారని ధ్వజమెత్తారు. సోమవారం గాంధీ భవన్‌లో పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరినసందర్భంగా రేవంత్‌ మాట్లాడారు.

ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందని.. భూవివాదాలకు ధరణి కారణమని.. అధికారంలోకి వస్తే దాన్ని రద్దుచేస్తామన్నారు.  రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ లేదన్న రేవంత్‌.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.  కేసీఆర్‌, మోదీలను బంగాళాఖాతంలో కలిపేయాలని.. కేంద్రం, రాష్ట్రాల్లో కాంగ్రెస్సే అధికారంలోకి రావాలని వ్యాఖ్యానించారు. సైన్యంలో 2లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నా నియామకాలు చెప్పట్టలేదన్నారు. రాత పరీక్షలనూ రద్దుచేశారని మండిపడ్డారు. పైగా నాలుగేళ్ల అవుట్‌ సోర్సింగ్‌ తీసుకొచ్చారన్నారు. సికింద్రాబాద్ అల్లర్ల కేసులో ఆందోళనకారులపై పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని