Revanth Reddy: కేటీఆర్‌ దత్తత తీసుకోవడం వల్లే కొడంగల్‌కు ఆ పరిస్థితి: రేవంత్‌రెడ్డి

వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌ను దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్‌.. ఈ నాలుగేళ్లలో అక్కడ ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. తెరాస పాలనలో కొడంగల్ నియోజకవర్గానికి తుప్పు పట్టిందన్నారు.

Updated : 05 Dec 2022 15:25 IST

కొడంగల్‌: వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌ను దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్‌.. ఈ నాలుగేళ్లలో అక్కడ ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. తెరాస పాలనలో కొడంగల్ నియోజకవర్గానికి తుప్పు పట్టిందన్నారు. కేటీఆర్‌ దత్తత తీసుకోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. కొడంగల్‌లో రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ తెరాస వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.

‘‘పాలమూరు-రంగారెడ్డి మినహా ఇతర ఏ ప్రాజెక్టుతోనూ తెరాసకు సంబంధం లేదు. అన్ని ప్రాజెక్టులు కాంగ్రెస్‌ హయాంలో నిర్మించినవే. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలి. 2019 జనవరి 1 నుంచి కొడంగల్‌కు అధికార పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. కొడంగల్ అభివృద్ధికి నిధులు వచ్చే వరకు ఎమ్మెల్యే ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. నిధులు ఇచ్చేవరకు దీక్ష కొనసాగించాలి. అసెంబ్లీలో కొడంగల్ అభివృద్ధిపై నిర్దిష్టమైన ప్రకటన చేయాలి. లేకపోతే గ్రామ గ్రామాన తిరిగి తెరాస పనితీరును ప్రజల ముందు పెడతాం. తెలంగాణలో పశ్చిమ బెంగాల్ తరహా రాజకీయం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ కవితను, రాష్ట్రం బీఎల్ సంతోష్‌లను ఎందుకు అరెస్టు చేయడం లేదు? కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీసేందుకే తెరాస, భాజపా కలిసి కుట్రలు చేస్తున్నాయ్‌’’ అని రేవంత్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని