Munugode: గిరిజనులకు వేలాది ఎకరాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే: రేవంత్‌

గిరిజనులకు వేలాది ఎకరాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

Published : 26 Sep 2022 02:03 IST

మునుగోడు: గిరిజనులకు వేలాది ఎకరాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఎక్కడో మారుమూల తండా నుంచి వచ్చిన బలరాం నాయక్‌కు కేంద్ర మంత్రిగా, శంకర్‌ నాయక్‌కు జిల్లా అధ్యక్షుడిగా కాంగ్రెస్‌ అవకాశమిచ్చిందన్నారు. ఇది గిరిజనులకు కాంగ్రెస్‌ ఇచ్చిన గౌరవంగా ఆయన అభివర్ణించారు. ‘‘ఈ ఎనిమిదేళ్లలో తెరాస, భాజపా గిరిజనులకు ఏమిచ్చాయి. గతంలో కాంగ్రెస్‌ ఇచ్చిన భూములను తిరిగి గుంజుకుంటున్నారు. కొత్త సీసాలో పాత సారాలా తెరాస, భాజపా ప్రజల ముందుకు వస్తున్నాయి. ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్నపుడు రాజగోపాల్ రెడ్డి  వెలగబెట్టిందేంటి? ఎనిమిదేళ్లుగా మంత్రిగా ఉన్న జగదీశ్‌ రెడ్డి గిరిజనులకు ఏం చేశారు? ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి స్రవంతిని గెలిపిస్తే పోడు భూముల సమస్యపై కోట్లాడి పట్టాలు ఇప్పించే బాధ్యత మాది’’ అని రేవంత్‌ అన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని