Congress: ఓయూలో నిరుద్యోగ మార్చ్‌.. రేవంత్‌ సహా కాంగ్రెస్‌ నేతల గృహనిర్బంధం

ఓయూ జేఏసీ నిరుద్యోగ మార్చ్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్‌ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

Published : 24 Mar 2023 12:27 IST

హైదరాబాద్‌: ఓయూ జేఏసీ నిరుద్యోగ మార్చ్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్‌ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. నిరుద్యోగ మార్చ్‌కు హాజరై సంఘీభావం ప్రకటిస్తానని రేవంత్‌ వెల్లడించిన నేపథ్యంలో ఆయన్ను నిర్బంధించారు.

జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి రేవంత్‌ బయటకు రాకుండా అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఆ మార్గంలో బారికేడ్లు పెట్టారు. స్థానికులను సైతం తనిఖీ చేస్తున్నారు. వారి గుర్తింపు కార్డులను పరిశీలించాకే ఆ ప్రాంతంలోకి అనుమతిస్తున్నారు. మరోవైపు పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, కాంగ్రెస్‌ నేతలు అంజన్‌కుమార్‌ యాదవ్‌, అద్దంకి దయాకర్‌, ఈరవత్రి అనిల్‌, సంకేపల్లి సుధీర్‌రెడ్డితో పాటు ఓయూ జేఏసీకి చెందిన పలువురు నేతలను కూడా పోలీసులు గృహనిర్బంధం చేశారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజ్‌ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా నిరుద్యోగ మార్చ్‌కు ఓయూ విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది. కాంగ్రెస్‌ ముఖ్యనేతలు సహా ఆ పార్టీ కార్యకర్తలు భారీగా హాజరవుతారని పోలీసులు భావించి అప్రమత్తమయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని