Revanth Reddy: లీకేజీ వ్యవహారం.. కేటీఆర్‌ నుంచి ఎందుకు సమాచారాన్ని సేకరించలేదు?: రేవంత్‌

టీఎస్‌పీఎస్‌సీలో పేపర్‌ లీకేజీ వ్యవహారంలో టీపీసీసీ  అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సిట్‌ విచారణకు హాజరయ్యారు. నిరుద్యోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకొనే విచారణకు హాజరైనట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.

Updated : 23 Mar 2023 15:14 IST

హైదరాబాద్‌: నిరుద్యోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకొనే సిట్‌ విచారణకు హాజరైనట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC) పేపర్‌ లీకేజీ కేసులో దర్యాప్తులో భాగంగా ఆరోపణలు చేస్తున్న వారందరికీ సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేస్తోన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా నోటీసులు అందుకున్న రేవంత్‌ రెడ్డి ఇవాళ విచారణకు హాజరయ్యారు.

విచారణ అనంతరం బయటకు వచ్చిన రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. ఆరోపణలు చేస్తున్న అందరికీ సిట్‌ నోటీసులు జారీ చేస్తోందని.. అలా అయితే మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపైనా చర్యలు తీసుకోవాలన్నారు. కేటీఆర్‌ వద్ద సంపూర్ణమైన సమాచారం ఉందని చెప్పారు. పూర్తి వివరాలు కేటీఆర్ వద్ద ఉన్నాయని సిట్‌ దర్యాప్తు అధికారి ఏఆర్‌ శ్రీనివాస్‌కు విచారణ సందర్భంగా రేవంత్‌ చెప్పానన్నారు. నేరస్థులను విచారించకుండానే కేటీఆర్‌ పూర్తి సమాచారం చెప్పారని.. కేటీఆర్‌ నుంచి సిట్‌ అధికారులు ఎందుకు సమాచారాన్ని సేకరించలేదని రేవంత్‌ ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని