Revanth Reddy: మేమొస్తే 30 రోజుల్లో రుణమాఫీ: రేవంత్‌రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 30 రోజుల్లో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని.. ఇందులో ఎలాంటి అనుమానాలు

Updated : 18 May 2022 15:49 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 30 రోజుల్లో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని.. ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని  విమర్శించారు. హైదరాబాద్‌లో తెలంగాణ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జరిగిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

రైతులకు రుణమాఫీని విడతల వారీగా వడ్డీతో సహా ప్రభుత్వమే చెల్లిస్తుందని రేవంత్‌ చెప్పారు. రాష్ట్రంలో వృథా ఖర్చును పూర్తిగా నిరోధిస్తామన్నారు. రైతుబంధును పేదలకు ఇవ్వాల్సి ఉండగా ధనికులకు ఎందుకు ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక వెసులుబాటును దృష్టిలో ఉంచుకునే వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ను ప్రకటించామని రేవంత్‌ తెలిపారు. ఏడేళ్లలో కేసీఆర్‌ రూ.5లక్షల కోట్ల అప్పులు చేశారని ఆయన ఆరోపించారు. 

రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసే తెలంగాణ ఇచ్చామని రాహుల్‌గాంధీ చెప్పారన్నారు. రానున్న రోజుల్లో వైద్యం, విద్య, నిరుద్యోగంపై డిక్లరేషన్లు ప్రకటిస్తామని రేవంత్‌ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వస్తే పంటల విషయంలో గందరగోళ పరిస్థితులు ఉండవని.. పంట మార్పిడి అవసరమైతే ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని