Telangana News: కేసీఆర్ సంతకం.. రైతుల పాలిట మరణ శాసనం: రేవంత్‌రెడ్డి

తెరాస, భాజపాలు రాజకీయ రాక్షస క్రీడకు తెరలేపాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేయకుండా ఈ రెండు పక్షాలు నాటకాలాడుతున్నాయని మండిపడ్డారు. దిల్లీలో రేవంత్‌ మీడియాతో మాట్లాడారు....

Published : 06 Apr 2022 02:06 IST

దిల్లీ: తెరాస, భాజపాలు రాజకీయ రాక్షస క్రీడకు తెరలేపాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేయకుండా ఈ రెండు పక్షాలు నాటకాలాడుతున్నాయని మండిపడ్డారు. దిల్లీలో రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని కేంద్రంతో కేసీఆర్‌ ఒప్పందం చేసుకున్నారని.. అలా సీఎం చేసిన సంతకం రైతుల పాలిట మరణ శాసనంగా మారిందని మండిపడ్డారు. రైతులు కష్టపడి పండించిన పంటను కొనే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ చెప్పలేదా? అని నిలదీశారు. 

మిల్లర్లతో కేసీఆర్‌ కుటుంబం కుమ్మక్కు అయిందని.. ప్రభుత్వం కొనకపోవడంతో రైతులు మిల్లర్లకు అమ్ముతున్నారని ఆరోపించారు. మిల్లర్లు చాలా తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. రూ.1,960కి కొనాల్సిన వడ్లను కేవలం రూ.1400కే కొనుగోలు చేస్తున్నారని రేవంత్‌ అన్నారు. కేంద్రం మద్దతు ధరను వరికి ప్రకటించిందా? లేక బియ్యానికి ప్రకటించిందా? అని ప్రశ్నించారు. కేంద్రం, రాష్ట్రం ఏం చేస్తాయో తెలియదు.. వడ్లు మాత్రం కొనాల్సిందేనని రేవంత్‌ డిమాండ్ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని