12 నెలల్లో అధికారంలోకి వస్తాం.. ప్రగతి భవన్‌ను నాలెడ్జ్‌ సెంటర్‌గా మారుస్తాం: రేవంత్‌రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధైర్యం లేక తనను పీసీసీ అధ్యక్షుడిగా నియమించగానే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ను తెచ్చుకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు...

Published : 27 Feb 2022 19:50 IST

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధైర్యం లేక తనను పీసీసీ అధ్యక్షుడిగా నియమించగానే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ను తెచ్చుకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు. ఇంటికో ఉద్యోగమిస్తామని గద్దెనెక్కిన కేసీఆర్‌.. తన ఇంట్లో అందరికీ ఉద్యోగాలు కల్పించుకున్నారని ఆరోపించారు. 

యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో చేపట్టిన నిరుద్యోగ నిరసన దీక్షలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి ... కార్యకర్తలను ఉత్తేజపరిచేట్లు  ప్రసంగించారు. తెలంగాణలో వచ్చే 12 నెలల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.  అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తనదేనని స్పష్టం చేసిన రేవంత్‌రెడ్డి.. గోల్కొండ కోట మీద కాంగ్రెస్‌ జెండాను ఎగురవేస్తామని ప్రకటించారు. ప్రగతి భవన్‌ను బీఆర్‌ అంబేడ్కర్‌ విజ్ఞాన కేంద్రంగా మార్చేందుకు మొదటి సంతకం ఉంటుందని స్పష్టం చేశారు. ఇవన్నీ జరగాలంటే 12 నెలల పాటు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడాలని యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీనియర్‌ నేతలు షబ్బీర్‌ అలీ, మల్లు రవి, అంజన్‌ కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు