Revanth Reddy: ఖాళీలు ఎప్పటిలోపు భర్తీ చేస్తారో చెప్పలేదు: రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ పోరాటం భయంతోనే కేసీఆర్‌ హడావుడిగా ఉద్యోగ ప్రకటనలు ఇచ్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఖాళీలు ఎప్పటిలోపు భర్తీ చేస్తారో సీఎం చెప్పలేదని ప్రశ్నించారు.

Published : 10 Mar 2022 01:57 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పోరాటం భయంతోనే కేసీఆర్‌ హడావుడిగా ఉద్యోగ ప్రకటనలు ఇచ్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఖాళీలు ఎప్పటిలోపు భర్తీ చేస్తారో సీఎం చెప్పలేదని ప్రశ్నించారు. ‘‘ గతంలో 1.07లక్షల ఖాళీలు ఉన్నాయని, మరో 50వేలు ఖాళీ కాబోతున్నాయని 2014 సెప్టెంబరు 7న చెప్పారు. 1.50లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. బిస్వాల్‌ కమిటీ 1.91లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పారు. 39శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్‌ కమిటీ నివేదిక ఇచ్చింది. ఇవాళ సభలో కేసీఆర్‌ అబద్ధాలు చెప్పారు. 80వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ప్రకటించారు..మిగలిన ఉద్యోగాలు కాకి ఎత్తుకుపోయిందా? కేసీఆర్‌ని ఉద్యోగాలు అడ్డుక్కోవాల్సిన అవసరంలేదు. 12 నెలల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. కేసీఆర్‌ ఉద్యోగం పోతే తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని