Revanth Reddy: రేవంత్‌ హౌస్‌ అరెస్ట్‌.. ఇంటి వద్దకు భారీగా పోలీసులు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటి ముందు పోలీసులు మోహరించారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్దకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకుని ఇంటి చుట్టూ ..

Updated : 16 Feb 2022 11:06 IST

హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటి ముందు పోలీసులు మోహరించారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్దకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకుని ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి ఆయన్ను గృహనిర్బంధం (హౌస్‌ అరెస్ట్) చేశారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు పోలీస్‌స్టేషన్ల ముందు ధర్నాలకు కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వద్ద రేవంత్‌రెడ్డి ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించి రేవంత్‌ను గృహనిర్బంధం చేశారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌స్టేషన్ల వద్ద ధర్నాలకు యత్నించిన కాంగ్రెస్‌ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. హైదరాబాద్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్‌ నేతలు షబ్బీర్‌ అలీ, మధుయాష్కీ తదితరులను అడ్డుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు