Revanth Reddy: పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి సీఎం రేవంత్‌

మాజీ స్పీకర్‌, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లారు.

Updated : 21 Jun 2024 16:37 IST

హైదరాబాద్‌: తెలంగాణ మాజీ స్పీకర్‌, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లారు. ఆయన్ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అంతకు ముందు రేవంత్‌కు పోచారం శ్రీనివాసరెడ్డి శాలువా కప్పి స్వాగతం పలికారు.

మరోవైపు భారాస మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు మరికొందరు ఆ పార్టీ నేతలు పోచారం ఇంటికి వెళ్లారు. సీఎం రేవంత్‌రెడ్డి అక్కడ ఉన్న సమయంలోనే నిరసనకు దిగారు. ఈ క్రమంలో భారాస, కాంగ్రెస్‌ నేతల మధ్య తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో బాల్క సుమన్‌, భారాస నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని