కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో రేవంత్ భేటీ
తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో కొంత జోష్ కనిపిస్తోంది
హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో కొంత జోష్ కనిపిస్తోంది. ఈక్రమంలో వివిధ పార్టీల నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కలిశారు. కొండా నివాసానికి వెళ్లిన రేవంత్‌రెడ్డి తాజా రాజకీయ పరిస్థితులపై ఆయనతో చర్చిస్తున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేసిన తర్వాత పలువురు నేతలతో భేటీ అయినప్పటికీ ఆయన ఇంత వరకు ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో రేవంత్‌రెడ్డి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
RC 16: రామ్‌చరణ్‌కు జోడీగా ఆ స్టార్ హీరోయిన్ కుమార్తె ఫిక్సా..?
-
Locker: బ్యాంక్ లాకర్లలో క్యాష్ పెట్టొచ్చా? బ్యాంక్ నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
-
Alia Bhatt: అప్పుడు మా వద్ద డబ్బుల్లేవు.. నాన్న మద్యానికి బానిసయ్యారు: అలియాభట్
-
Social Look: సమంత సైకిల్ రైడ్.. దేవకన్యలా ప్రియాంక.. రెడ్ డ్రెస్‌లో అనన్య
-
Maldives Elections: మాల్దీవులు నూతన అధ్యక్షుడిగా మొహ్మద్ మయిజ్జు
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/10/2023)