Revanth Reddy: ప్రజాస్వామ్యబద్ధంగా అనుమతి కోరుతున్నాం: రేవంత్‌రెడ్డి

ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలపై చాలా కేసులు నమోదు చేసి జైలుకు పంపారని.. చంచల్‌గూడ జైల్లో ఉన్న వారిని కలిసేందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈనెల 7న అక్కడికి వెళ్తారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు.

Updated : 05 May 2022 18:01 IST

హైదరాబాద్‌: ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలపై చాలా కేసులు నమోదు చేసి జైలుకు పంపారని.. చంచల్‌గూడ జైల్లో ఉన్న వారిని కలిసేందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈనెల 7న అక్కడికి వెళ్తారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. జైల్లో విద్యార్థులను రాహుల్‌ కలిసేందుకు జైలు సూపరింటెండెంట్‌ అనుమతి కోరామని చెప్పారు. జైళ్ల శాఖ డీజీని కలవాలని సూపరింటెండెంట్‌ తమకు సూచించినట్లు రేవంత్‌ చెప్పారు.

ఖైదీలను కలిసే హక్కు ఎవరికైనా ఉంటుందని.. ప్రజాప్రతినిధులుగా జైల్లో ఉన్న విద్యార్థులను కలిసేందుకు అనుమతివ్వాలని డీజీని కోరామన్నారు. ఆలోచించి నిర్ణయం చెబుతామని ఆయన తెలిపినట్లు వివరించారు. అధికారులపై తెరాస నేతలు ఒత్తిడి తెస్తున్నారని రేవంత్‌ ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని.. ఇది నిరంకుశ పాలన అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా తాము అనుమతి కోరుతున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని