‘34% నీళ్లు చాలని హరీశ్‌రావు సంతకం చేశారు’

రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి సారిగా తెలంగాణకు కృష్ణా జలాల్లో 34 శాతం నీళ్లు చాలని మంత్రి హరీశ్‌రావు సంతకం పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ..

Updated : 04 Jul 2021 17:33 IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి సారిగా తెలంగాణకు కృష్ణా జలాల్లో 34 శాతం నీళ్లు చాలని మంత్రి హరీశ్‌రావు సంతకం పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 299 టీఎంసీలు సరిపోతాయని ఇరిగేషన్‌ మంత్రి హోదాలో హరీశ్‌రావు సంతకం చేశారని గుర్తు చేశారు.

ఏడేళ్ల పాటు 299 టీఎంసీల నీటినే వాడుకున్నామన్నారు. రాయలసీమ ఎత్తిపోతలకు ఏపీ 203 జీవో ఇచ్చినప్పుడు, రూ.7వేల కోట్లు కేటాయించినప్పుడు కేసీఆర్‌ స్పందించలేదని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతలపై పాలమూరు రైతు గవినోళ్ల శ్రీనివాస్‌ ఎన్జీటీకి వెళ్లి స్టే తెచ్చారని వివరించారు. సామాన్య రైతు ఎన్జీటీకి వెళ్లి స్టే తెచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మోదీ సర్కారును అన్ని విషయాల్లో సమర్థించిన కేసీఆర్‌... నీటి విషయంలో కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. నోట్ల రద్దు, రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక, జీఎస్టీ, ఆర్టికల్‌ 370 రద్దు.. ఇలా అన్ని విషయాల్లో మోదీ ప్రభుత్వానికి కేసీఆర్‌ మద్దతిచ్చారని గుర్తు చేశారు. ఈనెల 9న కృష్ణా బోర్డు సమావేశం వాయిదా వేయాలని సీఎం కేసీఆర్‌ ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. కేఆర్‌ఎంబీ సమావేశంలో తెలంగాణ వాదన బలంగా వినిపించాలని డిమాండ్‌ చేశారు. కృష్ణా జలాల పరిరక్షణ కంటే సీఎం కేసీఆర్‌కు పెద్దపనులు ఏమున్నాయో చెప్పాలన్నారు. సీఎం వెళ్లలేని పక్షంలో సీనియర్‌ మంత్రిని సమావేశానికి పంపించాలని సూచించారు. 

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని