Revanth Reddy: కష్టపడి పని చేయాలి.. సర్వే ప్రాతిపదికనే టికెట్లు: రేవంత్ రెడ్డి
రానున్న ఆరు నెలల పాటు కష్టపడి పని చేయాలని, సర్వే ప్రాతిపదికనే టికెట్లు కేటాయిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. గాంధీభవవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పని చేసినవారిని తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. ఇందుకు కర్ణాటకలో మంత్రి పదవి దక్కించుకున్న బోసురాజే ఉదాహరణ అని చెప్పారు. గాంధీభవన్‌లో నిర్వహించిన సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా నాలుగు తీర్మానాలు చేసినట్లు తెలిపారు.. ఎఐసీసీ సెక్రెటరీలు బోసురాజు, నదీమ్ జావీద్‌లను అభినందిస్తూ, కొత్తగా నియమితులైన సెక్రెటరీలకు స్వాగతం పలుకుతూ 2 వేర్వేరు తీర్మానాలు చేసినట్లు పేర్కొన్నారు. బోయిన్‌పల్లిలోని రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ శంకుస్థాపనకు సోనియాగాంధీని ఆహ్వానించాలని సభ మరో తీర్మానం చేసింది.
మరోవైపు సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క పాదయాత్ర 1000కి.మీ పూర్తయిన సందర్భంగా ఆయన్ను అభినందిస్తూ తీర్మానం చేశారు. పార్టీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రెటరీలు ఇన్‌ఛార్జిలుగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి 15 రోజులకు ఒక నివేదిక పంపాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఆరు నెలలు కష్టపడి పని చేయాలని, పనితనం ఆధారంగానే టికెట్లు వస్తాయని చెప్పారు. ‘‘ సర్వేల ప్రాతిపదికనే టికెట్లు ఇస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది. అందుకు అందరం కలిసికట్టుగా పని చేయాలి.’’ అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Imran Tahir - MS Dhoni: ధోనీని అధిగమించిన ఇమ్రాన్ తాహిర్.. అశ్విన్‌కు థ్యాంక్స్ చెప్పిన వెటరన్ ప్లేయర్!
-
Pawan Kalyan: అక్టోబర్ 1 నుంచి పవన్ నాలుగో విడత ‘వారాహి’ యాత్ర
-
TS News: త్వరలో నియోజకవర్గానికో డయాలసిస్ కేంద్రం: హరీశ్ రావు
-
US visa: అమెరికాలో చదువు.. రికార్డు స్థాయిలో 90వేల వీసాలు జారీ
-
పిల్లలతో కలిసి మా సినిమా చూడొద్దు: స్టార్ హీరో
-
TS High Court: నోటరీ స్థలాల క్రమబద్ధీకరణపై తెలంగాణ హైకోర్టు స్టే