Chandrababu Arrest: ఐటీ ఉద్యోగుల నిరసనల్లో తప్పేముంది: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌ పదేళ్లపాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని, ఏపీకి సంబంధించిన అంశంపై ఇక్కడ నిరసన జరపొద్దు అంటే ఎలా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

Updated : 27 Sep 2023 19:29 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పదేళ్లపాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని, ఏపీకి సంబంధించిన అంశంపై ఇక్కడ నిరసన జరపొద్దు అంటే ఎలా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. నిరసనలు చేయవద్దన్న కేటీఆర్‌ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. 

‘‘చంద్రబాబు అరెస్టు ఏపీకి మాత్రమే సంబంధించింది కాదు. చంద్రబాబు దేశ నాయకుడు. ఆయన అరెస్టుపై తెలంగాణలో నిరసనలు తెలపడంలో తప్పేముంది. నిరసన తెలిపే వాళ్లంతా ఇక్కడి ఓటర్లే. నిరసనకారులను నియంత్రించడంలో అర్థం లేదు. నిరసన తెలిపే హక్కును ఎవరూ కాలరాయలేరు. ఏ పార్టీ వాళ్లైనా నిరసన తెలిపే హక్కు ఉంది. ఐటీ ఉద్యోగుల నిరసనల్లో తప్పేముంది? ఉద్యమ సమయంలో అమెరికాలోనూ నిరసనలు జరిగాయి. ఏం హక్కు ఉందని అమెరికాలో నిరసనలు చేశారు? ప్రతి సమస్యకు దిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్నారు?ఏం హక్కు ఉందని దిల్లీలో నిరసనలు చేశారు?’’ అని రేవంత్‌ ప్రశ్నించారు.

విడతల వారీగా అభ్యర్థుల ప్రకటన..

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ఒకేసారి విడుదల చేయబోమని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అభ్యర్థుల ప్రకటన విడతల వారీగా ఉంటుందన్నారు. మైనంపల్లి కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. మైనంపల్లి హన్మంతరావు గురువారం కాంగ్రెస్‌లో చేరుతారని రేవంత్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని