Revanth Reddy: ఏడాది ఓపిక పట్టండి.. కాంగ్రెస్ కార్యకర్తలెవరూ పార్టీ వీడొద్దు: రేవంత్‌ రెడ్డి

పార్టీ ఫిరాయింపులకు తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ ప్రయోగశాలగా మార్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో సర్పంచ్‌, ఎంపీటీసీలను అధికార

Published : 16 Aug 2022 01:41 IST

హైదరాబాద్‌: పార్టీ ఫిరాయింపులకు తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ ప్రయోగశాలగా మార్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో సర్పంచ్‌, ఎంపీటీసీలను అధికార పార్టీ కొనుగోలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు రేవంత్‌ వీడియో విడుదల చేశారు. తాను ఇప్పటికే మునుగోడులో పర్యటించాల్సి ఉన్నా.. కొవిడ్‌ కారణంగా రాలేకపోయానని రేవంత్‌ పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీ నుంచి మునుగోడులోనే ఉంటానని వెల్లడించారు. ‘‘కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ పార్టీ వీడొద్దు. ఎనిమిదేళ్లు కొట్లాడిన నాయకులు.. ఒక ఏడాది ఓపిక పడితే కాంగ్రెస్‌ పార్టీనే అధికారంలోకి వస్తుంది. మునుగోడు ఉపఎన్నిక అనేది తెలంగాణ భవిష్యత్‌ కాబోతుంది. తెరాస, భాజపాకు బుద్ధి చెప్పాల్సిన సమయమిది. ఇలాంటి సమయంలో పార్టీ మారి చరిత్ర హీనులుగా ఎవరూ మిగిలిపోవద్దు’’ అని కార్యకర్తలకు రేవంత్‌ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని