Revanth reddy: జేపీఎస్‌లను రెగ్యులరైజ్‌ చేయకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధం: రేవంత్‌రెడ్డి

జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్‌ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. భారాస ప్రభుత్వంలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి బానిసల కంటే హీనంగా తయారైందని విమర్శించారు.

Published : 09 May 2023 17:06 IST

హైదరాబాద్‌: జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్‌ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. భారాస ప్రభుత్వంలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి బానిసల కంటే హీనంగా తయారైందని విమర్శించారు. ఈమేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 79 అవార్డులు జూనియర్ కార్యదర్శుల కష్టంతోనే వచ్చాయనే విషయాన్ని మరచిపోవద్దన్నారు.

వీరికి సంబంధించిన నాలుగేళ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకొని సర్వీసు రూపొందించాలన్నారు. పది పద్దు కింద వేతనాలిస్తూ ఈహెచ్‌ఎస్‌ కార్డులు  అందజేయాలని, చనిపోయిన పంచాయతీ కార్యదర్శుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించేలా కారుణ్య నియామకాలు చేపట్టాలని తెలిపారు. ఔట్‌ సోర్సింగ్‌ సెక్రటరీలను కూడా రెగ్యులర్‌ చేయాలన్నారు. ఇతర శాఖల్లోని ప్రభుత్వ మహిళా పంచాయతీ కార్యదర్శులకు 6 నెలల ప్రసూతి సెలవులు, 90 రోజుల ఛైల్డ్‌ కేర్‌ సెలవులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో వారి పోరాటానికి కాంగ్రెస్‌ పార్టీ మద్దతుగా నిలిచి ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతుందని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు