Revanth Reddy: యాసంగిలో చివరి గింజ కొనేవరకు నిఘా పెడతాం: రేవంత్‌రెడ్డి

యాసంగిలో చివరి గింజ కొనేవరకు ప్రభుత్వంపై నిఘా పెడతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో యాసంగిలో పండిన వరి ధాన్యం మొత్తం కొనుగోలు

Published : 13 Apr 2022 01:22 IST

హైదరాబాద్‌: యాసంగిలో చివరి గింజ కొనేవరకు ప్రభుత్వంపై నిఘా పెడతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో యాసంగిలో పండిన వరి ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనపై ట్విటర్‌ వేదికగా రేవంత్ స్పందించారు. యాసంగి వడ్లు కొనుగోలు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిరంతరం పోరాటం సాగించింది. రైతుల సమస్యలపై తెలంగాణలో రాహుల్‌గాంధీ సభ ఫలితమే ధాన్యం కొనడానికి కేసీఆర్‌ నిర్ణయం. అయినా, కేసీఆర్‌ను నమ్మడానికి వీల్లేదు. చివరి గింజ కొనే వరకు నిఘా పెడతాం. తేడా వస్తే కేసీఆర్‌ సంగతి తేలుస్తాం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణలో పండిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతి ఊరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఒక్క గింజ కూడా రైతులు తక్కువ ధరకు అమ్ముకోవద్దని విజ్ఞప్తిచేశారు. క్వింటాలుకు రూ.1960లు చెల్లిస్తామని, ధాన్యం డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని సీఎం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని