Updated : 12 Jan 2022 17:47 IST

TS News: కాంగ్రెస్‌ సభ్యత్వం తీసుకున్నవారికి రూ.2లక్షల బీమా సదుపాయం: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి రూ.2లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు
 గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ఎవరైనా ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.2లక్షలు, ప్రమాదం జరిగి అవయవాలు దెబ్బతింటే తీవ్రతను బట్టి పరిహారం అందుతుందని ఇన్సూరెన్స్‌ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. 

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.... కాంగ్రెస్‌ పార్టీలో చేరే వారికి ఒక ధీమా కల్పిస్తున్నట్టు చెప్పారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి గుర్తింపు కార్డు ఇస్తున్నామని తెలిపారు. చాలా పారదర్శకంగా కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదు నిర్వహిస్తున్నామని,  దాదాపు 30లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వెల్లడించారు. చనిపోయిన కార్యకర్త కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేందుకే బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, పీఏసీ కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని