Published : 01 Jul 2022 02:01 IST

Revanthreddy: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాను కలిసేందుకు సిద్ధంగా లేము: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాను కలిసేందుకు తాము సిద్ధంగా లేమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెరాస అధినేత కేసీఆర్‌ను కలిసేందుకు వస్తున్న ఆయన్ను కలిసేది లేదని కుండబద్దలు కొట్టారు. తమను కలిసేందుకు వచ్చి కేసీఆర్‌ను కలవాలనుకున్నా... కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చి తమను కలవాలన్నా తాము కలిసేది ఉండదని స్పష్టం చేశారు. యశ్వంత్‌ సిన్హా టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని మమతా బెనర్జీ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు కోరారు. మద్దతిచ్చాం... ఎన్నికల్లో ఓట్లు వేస్తామని వివరించారు.

‘‘చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నాకు మంచి మిత్రుడు. పార్టీ మారుతున్నట్టు ఒకమాట అయినా చెబుతారని అనుకున్నా. కానీ, చెప్పలేదు. అయినా... ఆయనపై స్పందించేది ఏముంది? భాజపాలో చేరిన కొద్ది కాలానికే విశ్వేశ్వరరెడ్డి తిరిగి బయటకు వస్తారని భావిస్తున్నా’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని