Revanth: పెద్దమ్మగుడిలో రేవంత్‌ పూజలు

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడిలో పూజలు..

Updated : 08 Jul 2021 14:00 IST

హైదరాబాద్‌: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడిలో పూజలు చేశారు. అనంతరం అక్కడికి భారీగా చేరుకున్న కార్యకర్తలతో ఆయన నాంపల్లిలోని దర్గాకు ర్యాలీగా బయలుదేరారు. దర్గాలో చాదర్ సమర్పించి ప్రార్ధనలు చేయనున్నారు. అక్కడి నుంచి గాంధీ భవన్‌కు చేరుకోనున్న రేవంత్.. మధ్యాహ్నం 1.30 గంటలకు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని