Andhra news: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజా.. గుమ్మడికాయతో దిష్టి తీసిన భర్త

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆర్కే రోజా ఇవాళ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం రెండో బ్లాక్‌లో రాష్ట్ర పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Updated : 13 Apr 2022 16:26 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆర్కే రోజా ఇవాళ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం రెండో బ్లాక్‌లో రాష్ట్ర పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గుమ్మడికాయతో స్వయంగా ఆమె భర్త సెల్వమణి దిష్టి తీశారు.

బాధ్యతలు తీసుకున్న అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ.. ‘‘పార్టీ పెట్టక ముందు నుంచి సీఎం జగన్ అడుగుజాడల్లో నడిచాను. మంత్రులుగా ఉన్న వారంతా జగన్ సైనికుల్లా పని చేశారు. కేబినెట్‌లో కుల సమీకరణాల ఆధారంగా కేటాయింపులు చేశారు. పార్టీ కోసం జెండా పట్టుకొని నడిచిన ప్రతి ఒక్కరికీ సీఎం జగన్‌ న్యాయం చేస్తున్నారు. జగన్ నమ్ముకాన్ని వమ్ము చేయను. రాష్ట్రంలో ఉన్న వనరులను ఉపయోగించుకొని అభివృద్ధి చేస్తాం. సముద్ర తీర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా రాష్ట్రంలో అనుకూలమైన టూరిజంను అభివృద్ధి చేస్తాం. క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధికి కృషి చేస్తా. గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించడమే కాకుండా క్రీడాకారులకు వసతులు కల్పిస్తాం. ఆర్టిస్ట్‌గా కళాకారుల సమస్యలు నాకు తెలుసు. కళాకారులకు మంచి చేసేలా నిర్ణయాలు తీసుకుంటా. గండికోట నుంచి బెంగుళూరుకు పర్యాటకం కోసం బస్సు సర్వీసు ఏర్పాటుపై మొదటి సంతకం చేస్తా’’ అని రోజా తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని