Pinnelli: పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్‌?

పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు రౌడీషీట్‌ తెరిచినట్లు తెలిసింది.

Published : 16 Jun 2024 06:49 IST

మాచర్ల (కారంపూడి), న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు రౌడీషీట్‌ తెరిచినట్లు తెలిసింది. పోలింగ్‌ రోజున రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామంలోని కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టారు. దీన్ని అడ్డుకున్న తెదేపా కార్యకర్త నంబూరి శేషగిరిరావుపై అనుచరులతో దాడి చేయించారు. పోలింగ్‌ మరుసటి రోజు కారంపూడిలో ఇద్దరు సోదరులూ అనుచరులతో కలిసి దాడులు చేశారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలకు సంబంధించి పిన్నెల్లి సోదరులపై కేసులు నమోదైన విషయం విదితమే. వీరి మీద రౌడీషీట్‌ తెరవడంపై వివరాలు చెప్పేందుకు పోలీసు అధికారులు సుముఖత వ్యక్తం చేయడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని