కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చేందుకు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు: సచిన్ పైలట్
కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గం పరిధిలోని యూసుఫ్‌బాబా దర్గా నుంచి హనుమాన్ మందిర్ వరకు ఇంటింటికి ఆరు గ్యారంటీలు పేరుతో నిర్వహించిన ర్యాలీలో సచిన్ పైలట్ పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా నాంపల్లి యూసుఫ్ బాబా దర్గా నుంచి హనుమాన్ మందిర్ వరకు ప్రజలను కలుస్తూ విజయభేరి సభలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను వివరించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లిలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి ఫిరోజ్ ఖాన్, దిల్లీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అరవింద్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం
-
Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు నివాసం వద్ద అర్ధరాత్రి భారీగా పోలీసుల మోహరింపు
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..
-
Crime news : మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. బాధితురాలికి నా ఖాకీ చొక్కా ఇచ్చా : ఆటో డ్రైవర్
-
Rishi Sunak: ఉక్రెయిన్‌కు బ్రిటన్ సైనికులు.. రిషి సునాక్ స్పందన ఇదే!
-
ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు.. కనువిందుగా కళాకారుల ప్రదర్శనలు