Congress Crisis: అధినేత్రి సోనియాతో సచిన్‌ పైలట్‌ భేటీ.. ఎందుకో?

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో  పార్టీ సీనియర్‌ నాయకుడు, రాజస్థాన్‌ మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌పైలట్‌ భేటీ అయ్యారు. అధ్యక్షపదవి రేసు నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ..ముఖ్యమంత్రిగా కొనసాగాలా? వద్దా? అనే విషయం సోనియా గాంధీ నిర్ణయంపై...

Published : 30 Sep 2022 01:12 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో  పార్టీ సీనియర్‌ నాయకుడు, రాజస్థాన్‌ మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ అయ్యారు. అధ్యక్ష పదవి రేసు నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌.. ముఖ్యమంత్రిగా కొనసాగాలా? వద్దా? అనే అంశం సోనియా గాంధీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గహ్లోత్‌ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే సోనియాతో సచిన్‌ పైలట్‌ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి అంశంపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని పార్టీ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ పేర్కొన్న నేపథ్యంలో సీఎం స్థానంపైనే సచిన్‌పైలట్‌, సోనియా భేటీ జరిగి ఉండొచ్చని తెలుస్తోంది.

అధ్యక్షుడిగా గహ్లోత్‌ ఎన్నికైతే..ముఖ్యమంత్రి పదవిని సచిన్‌పైలట్‌కు ఇస్తామనడాన్ని వ్యతిరేకిస్తూ గహ్లోత్‌ మద్దతుదారులు రాజీనామాలు చేస్తామంటూ అధిష్ఠానాన్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెలకొన్న సంక్షోభాన్ని  గట్టెక్కించేందుకు సీనియర్‌ నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.మరోవైపు రాష్ట్రంలో ఏర్పడిన అనిశ్చితికి నైతిక బాధ్యత వహిస్తూ గహ్లోత్‌ అధ్యక్షపదవి రేసు నుంచి తప్పుకున్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన గహ్లోత్‌ మద్దతు దారులపై అధిష్ఠానం చర్యలకు ఉపక్రమిచించింది. ముగ్గురు ఎమ్మెల్యేలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదతో పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.  పార్టీ కేంద్ర పరిశీలకులు మల్లిఖార్జున ఖర్గే, అజయ్‌ మాకెన్‌ల నివేదిక అధిష్ఠానానికి చేరిన తర్వాత ఈ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts