Job Scam: ప్రభుత్వానికి అదో పెద్ద మచ్చ.. ఆ మంత్రిపై వేటు వేయండి: అధిర్‌

ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాల్లో భారీ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టయిన మంత్రి పార్థా ఛటర్జీపై తక్షణమే వేటు వేయాలని.......

Published : 26 Jul 2022 15:34 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాల్లో భారీ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టయిన మంత్రి పార్థా ఛటర్జీపై తక్షణమే వేటు వేయాలని కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌధరి బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని కోరారు. ఈ మేరకు ఆయన దీదీకి లేఖ రాశారు. స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) నియామక ప్రక్రియలో అక్రమాలు బహిరంగ రహస్యమేనని లేఖలో పేర్కొన్నారు. ‘‘ పార్థా ఛటర్జీ దుర్మార్గాల గురించి చెప్పడానికే నేనీ లేఖ రాస్తున్నా. 2014 నుంచి 2021వరకు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయ నియామకాల్లో అక్రమాలు వచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. కోర్టు జోక్యం తర్వాతే ఈ అంశంపై దర్యాప్తు సంస్థలు చర్యలు ప్రారంభించాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అదో పెద్ద మచ్చ. పార్థా ఛటర్జీని తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలి’’ అని బెంగాల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా ఉన్న అధిర్‌ తన లేఖలో పేర్కొన్నారు. 

ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మంత్రి పార్థా ఛటర్జీని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, సిటీ కోర్టు మంత్రితో పాటు అతడి సన్నిహితురాలిగా పేర్కొంటున్న అర్పితా ముఖర్జీని పది రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, తప్పు చేసిన వారు ఎంత పెద్ద వారైనా తమ పార్టీ సహకరించే ప్రసక్తే లేదని మమతతో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు తేల్చి చెబుతున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని