Sadineni Yamini: ఈవీఎంలపై అప్పుడెందుకు మాట్లాడలేదు?: యామినీశర్మ

ఎన్నికల్లో ఘోర ఓటమితో వైకాపా భవిష్యత్తు అంధకారం కావడంతో ఆ పార్టీ నాయకులు ఈవీఎంలపై రాజకీయ పరిపక్వత లేని మాటలు మాట్లాడుతున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ విమర్శించారు.

Updated : 19 Jun 2024 07:16 IST

ఈనాడు డిజిటల్, అమరావతి: ఎన్నికల్లో ఘోర ఓటమితో వైకాపా భవిష్యత్తు అంధకారం కావడంతో ఆ పార్టీ నాయకులు ఈవీఎంలపై రాజకీయ పరిపక్వత లేని మాటలు మాట్లాడుతున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ విమర్శించారు. ‘2019 ఎన్నికల్లో ప్రజలు.. జగన్‌ పార్టీకి 151 సీట్లు ఇచ్చారు. అప్పుడూ ఉపయోగించింది ఈవీఎంలే. వాటి నిషేధంపై అప్పుడెందుకు మాట్లాడలేదు. మరి.. అప్పటి వైకాపా విజయం నిజం కాదా? అంబటి రాంబాబు లాంటి అసమర్థ మంత్రుల వల్ల పోలవరం 4 శాతం కూడా పూర్తవలేదు’ అని ఆమె ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని