MP Avinash reddy-Sajjala: సీబీఐ విచారణతో ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదు: సజ్జల

ఎంపీ అవినాష్‌రెడ్డిపై జరుగుతున్న సీబీఐ విచారణ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు.

Updated : 23 May 2023 14:35 IST

అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్‌రెడ్డిపై (mp avinash reddy) సీబీఐ చేస్తున్న విచారణతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని, ఈ విషయంలో సీఎం జగన్‌ ఎక్కడా జోక్యం చేసుకోలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో అనేక విషయాలపై మాట్లాడారు. కేంద్రం విడుదల చేసిన నిధుల అంశంపైనా స్పందించారు.

‘‘ఒక బాధ్యత కలిగిన ఎంపీగా అవినాష్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన ఎక్కడా తప్పించుకోలేదు.. ఇప్పటికే ఆరేడుసార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు. తన తల్లికి బాగోలేకపోవడంతో విచారణకు హాజరు కాలేనని అవినాష్‌ చెప్పారు. విచారణకు వచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. అవినాష్ అరెస్టుకు కర్నూలు ఎస్పీ సహకరించడ లేదనడం ఊహాగానాలను ప్రచారం చేయడమే. అవినాష్ విషయంలో ఏమిటీ అన్యాయమని అనుకునేవారు కర్నూలుకు వస్తున్నారు.

నిజమైన మీడియాలో పనిచేస్తున్న వారిపై దాడి జరగలేదు. అవినాష్ విషయంలో డ్రామాలు, నాటకాలు ఆడుతున్నారంటే ఎవరికైనా కడుపు మండకుండా ఉంటుందా? ఎవరికో ఆవేశం వస్తే ప్రశ్నిస్తారు. దీనిపై మీడియాపై దాడి అని అంటున్నారు. కర్నూలుకు కేంద్ర బలగాలు వస్తున్నాయని కొన్ని మీడియాల్లో అసత్య ప్రచారం చేశారు. రాష్ట్రానికి కేంద్రం రూ.10వేల కోట్లు ఇచ్చి పెద్ద ఊరటనిచ్చిందని ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉంది. గతంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులనే కేంద్రం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం వల్ల నిధులు విడుదలయ్యాయి. నిధులు రాకపోయినా పట్టుదలగా పథకాలను అమలు చేస్తున్నాం’’ అని సజ్జల అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు