నాలుగు నెలల్లో విశాఖకు రాజధాని: సజ్జల

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్ఈసీ) ప్రకటించిన ఎన్నికల నోటిఫికేషన్‌ వెనక దురుద్దేశాలు ఉన్నాయి కాబట్టే హైకోర్టు తగిన తీర్పునిచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆలయాలపై దాడులు ఆగిన వెంటనే..

Published : 13 Jan 2021 01:23 IST

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్ఈసీ) ప్రకటించిన ఎన్నికల నోటిఫికేషన్‌ వెనక దురుద్దేశాలు ఉన్నాయి కాబట్టే హైకోర్టు తగిన తీర్పునిచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆలయాలపై దాడులు ఆగిన వెంటనే ఎన్నికల వ్యవహారం తెరపైకి రావడం అనుమానాలకు తావిస్తుందన్నారు. ఎన్నికల సంఘం కార్యకలాపాలకు పథకం ప్రకారం విఘాతం కలిగించారన్న అభియోగాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త సంచాలకుడు(జేడీ) జీవీ సాయిప్రసాద్‌ను, తాజాగా ఏపీ ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి వాణీ మోహన్‌ను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తొలగించిన విషయం తెలిసిందే. దీనిపై సజ్జల స్పందిస్తూ.. అధికారుల తొలగింపు ఉద్యోగులను బెదిరించేలా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఒక ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని సజ్జల మండిపడ్డారు. అనంతరం రాజధాని తరలింపుపై స్పందిస్తూ.. నాలుగు నెలల్లో విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియ మొదలు కానుందని చెప్పారు. అప్పటికల్లా కోర్టుల్లో అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి..

వారంతా సంఘ విద్రోహ శక్తులే: ఉండవల్లి

ఏపీలో రాజకీయ ఉగ్రవాదం: చంద్రబాబు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని