Andhra News: చంద్రబాబును ప్రజలు ఎప్పుడో క్విట్ చేసి రాష్ట్రాన్ని సేవ్ చేశారు: సజ్జల

బాదుడే బాదుడు కార్యక్రమం పేరుతో తెదేపా అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసే ఆరోపణలు, విమర్శలను ప్రజలు నమ్మడ...

Published : 07 May 2022 01:39 IST

అమరావతి: బాదుడే బాదుడు కార్యక్రమం పేరుతో తెదేపా అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసే ఆరోపణలు, విమర్శలను ప్రజలు నమ్మడం లేదన్నారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులు సీఎం వైఎస్ జగన్‌కే ఉన్నాయని చెప్పారు. పన్నులన్నీ చంద్రబాబు వారసత్వంగా రాష్ట్రానికి ఇచ్చిపోయినవేనని.. వైకాపా ప్రభుత్వం కొత్తగా వేసిననవి కాదని స్పష్టం చేశారు. పన్నులపై వచ్చిన ప్రతి పైసాను ప్రజా సంక్షేమం కోసమే వెచ్చిస్తున్నట్లు చెప్పారు. ఎపీలో నాడు-నేడు అమలు చేసినట్లుగా తెలంగాణలోనూ స్కూళ్లు అభివృద్ది చేస్తున్నారని, దీనికోసం ఏపీ కంటే తెలంగాణ ప్రభుత్వం రెండింతలు బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. అదే నిజమైతే జరగబోయే అభివృద్ధి ఎలా ఉంటుందో తెలుస్తుందన్నారు. సీఎం జగన్ ఎక్కడా ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు సభలకు జనాన్ని తీసుకొచ్చి అదే బలమని డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును ప్రజలు ఎప్పుడో క్విట్ చేసి రాష్ట్రాన్ని సేవ్ చేశారని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని