Andhra News: బీసీలంతా వైకాపా వెంటే ఉన్నారు: సజ్జల

బీసీలంతా వైకాపా వెంటే ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...

Published : 11 Apr 2022 02:05 IST

తాడేపల్లి: బీసీలంతా వైకాపా వెంటే ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కొత్త కేబినెట్‌ కూర్పులో సామాజిక సమీకరణలపై వివరించారు. తమ కేబినెట్‌లో దాదాపు 70శాతం మంది బీసీలు ఉన్నారని వెల్లడించారు. 

‘‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు 17 మంత్రి పదవులు దక్కాయి. మా మంత్రివర్గ జాబితాను చంద్రబాబు పరిశీలించాలి. తెదేపా ప్రభుత్వంలో 25 మంది మంత్రుల్లో 55శాతం ఓసీలు ఉన్నారు. కానీ, జగన్‌ కేబినెట్‌లో 68 శాతం వెనుకబడిన వర్గాల వారే ఉన్నారు. 2014 నుంచి 2018 వరకు ఎస్టీలు, మైనార్టీలకు కేబినెట్‌లో ప్రాతినిధ్యం లేదు. వైకాపా ఎప్పుడూ రాజకీయ సాధికారత దిశగా అడుగులు వేస్తుంది. ట్రస్టులు, నామినేటెడ్‌, ఇతర సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేశాం’’ అని సజ్జల వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని