Telangana News: పెళ్లికి వెళ్లిన వీడియోను చూపిస్తూ రాజకీయమా..?: జగ్గారెడ్డి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ నేపాల్‌లోని ఓ నైట్‌ క్లబ్‌లో పార్టీ చేసుకుంటున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

Updated : 03 May 2022 16:58 IST

హైదరాబాద్: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ నేపాల్‌లోని ఓ నైట్‌ క్లబ్‌లో పార్టీ చేసుకుంటున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు నేపాల్‌లోని చైనా రాయబారి కూడా ఉన్నట్లు వార్తలు రావడంతో విపక్షాలు తీవ్రంగా విరుచుపడుతున్నాయి. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్‌ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. రాహుల్‌గాంధీ ఓ పెళ్లికి వెళ్లిన వీడియోను చూపించి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పెళ్లికి వెళ్లిన వీడియోను చూపిస్తూ రాజకీయం చేయడం దుర్మార్గమన్నారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. అర్ధరాత్రి పార్టీలు చేసుకొనే అధికార పార్టీ నేతలు తనకు తెలుసునని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

ఈ నెల 6వ తేదీన వరంగల్‌ జిల్లాలో నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభకు రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభ ద్వారా రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు చెప్పారు. ధరణిలో ఉన్న లోపాలతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అసైన్డ్‌ భూములను రైతుల నుంచి బలవంతంగా ప్రభుత్వం లాక్కుంటుందని జగ్గారెడ్డి మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని