Published : 14 Aug 2022 02:13 IST

BJP: ఈటల సమక్షంలో భాజపాలో చేరిన సినీనటుడు సంజయ్‌ రాయిచుర

హైదరాబాద్‌: సినీనటుడు సంజయ్‌ రాయిచుర భాజపాలో చేరారు. హుజురాబాద్‌ ఎమ్మెల్యే, భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్‌ సమక్షంలో ఆయన భాజపా కండువా కప్పుకున్నారు. నరేంద్ర మోదీ విజన్‌, సమర్థవంతమైన నాయకత్వ లక్షణాల పట్ల ఆకర్షితమై భాజపా తీర్థం పుచ్చుకున్నట్టు సంజయ్‌ తెలిపారు. రాయిచుర చేరిక పార్టీని మరింత బలోపేతం చేసిందని ఈటల రాజేందర్‌ అన్నారు. ఆచార్య, మహర్షి సినిమాలతో పాటు పలు దక్షిణాది చిత్రాలు, సీరియళ్లలో సంజయ్‌ నటించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts